లాక్ డౌన్ వలన 'వి ' మూవీతో మీ ఇంటికే వస్తున్నాం - TeluguCircle-Trending News

Breaking

20 August 2020

లాక్ డౌన్ వలన 'వి ' మూవీతో మీ ఇంటికే వస్తున్నాం



నేచురల్ స్టార్ నాని, ఇంద్రగంటి మోహన్ కృష్ణ కంబినేషనలో వస్తున్నా మరో పవర్ ఫుల్ కథతో ముచ్చటగా మూడో సారి ' #V  ' సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమాలో నాని తో పాటు సినిమా నేపధ్యం ఉన్నా కుటుంబం నుంచి వచ్చిన తనకంటూ ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సుధీర్ బాబు కూడా ఈ సినిమాలో మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. కథా నాయకిగా నివేతా థామస్  నటిస్తుంది. ఈ ముల్టీస్టారర్ మూవీని హిట్ కథా చిత్రాల ప్రొడ్యూసర్ 'దిల్' రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఈ లాక్ డౌన్ కారణంగా ఈ సినిమాని #OTT మీడియా సర్వీస్ ద్వారా  విడుదల  చేస్తున్నారు. ' వి ' సినిమా నాని కెరీర్లో 25 వ సినిమా  కావడం విశేషం. అందుకే ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించిన నాని .. తన అభిమానులకు శ్రేయోభిలాషులకు ప్రత్యేకంగా లేఖ రాసాడు. 

" అభిమానులారా .. ఇప్పుడు ఉన్న పరిస్థితులు సాధారణమైనవి కావు. అందుకే ఎప్పటిలాగా థియేటర్లో ఎక్సపీరియన్సు చేయలేము. నా  25వ సినిమా చాలా ప్రత్యేకం. అలాగే అనేక కారణాల వలన ఓ టి టి మీడియా సర్వీస్ ద్వారా #AmazonPrime లో  ఈ సెప్టెంబర్ 5న విడుదల కాబోతుంది. దీన్ని మరింత గుర్తుండిపోయేలా చేద్దాం.  గత 12సంత్సరాలగా మీరు నా కోసం థియేటర్కి వచ్చారు. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి దన్యవాదాలు చెప్పబోతున్న.. ఈ సినిమా ఫై మీ స్పందన కోసం ఎంతో  ఎదురుచూస్తున్న … మరో విషయం .. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటే అప్పుడు ' టక్ జగదీష్ వస్తాడు. ప్రమాణం చేస్తున్న " అని లేఖలో పేర్కొన్నారు. 


https://www.youtube.com/watch?v=UgJvX9-MNGc


No comments: